మంచేరియల్, 2026-07-30
రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో చేపల వేటపై నిషేధం విధించినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్. అవినాష్ తెలిపారు. మత్స్యకారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులందరికీ ఒక విజ్ఞప్తి. రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో చేపల వేటపై నిషేధం విధించబడింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని సూచించడమైనది. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
భారీ వర్షాల సూచనల మేరకు చేపల వేట నిషేధించబడింది. చెరువులు, వాగులు, కాలువల వద్ద చేపల వేటకు వెళ్లకూడదని, అలాగే సరదాగా ఈత కొట్టడానికి కూడా వెళ్లరాదని హెచ్చరిస్తున్నాము.
చెరువులు, కుంటల వద్ద చేపల కోసం జాలీలు, వలలు అమర్చినట్లయితే వెంటనే వాటిని తొలగించాలని మత్స్య శాఖ విజ్ఞప్తి చేసింది. దీనిని పాటించని వారి లైసెన్సులు, సంఘాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడతాయని తెలియజేయడమైనది. ముఖ్యంగా గోదావరి ప్రవాహిక మండలాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
గ్రామ పంచాయతీ పరిధిలో టామ్ టామ్ (Tom Tom) ద్వారా చేపల వేటకు వెళ్లరాదని అందరినీ అప్రమత్తం చేయాలని మత్స్య శాఖ కోరుతోంది. గోదావరి, రిజర్వాయర్లలో చేపల వేట నిషేధం అమలులో ఉన్నందున, అందరూ తప్పనిసరిగా దీనిని పాటించాలని మత్స్య శాఖ నుంచి విజ్ఞప్తి.
ఈ మేరకు జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్. అవినాష్ ఒక ప్రకటన విడుదల చేశారు.









