గోదావరిఖని, 13 September
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు పర్యావరణ ప్రయోజనాలను వివరించారు.
మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం..! బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ...!! పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు మట్టి వినాయకుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలను వివరించి, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం పెరిగి జలచరాలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయకులను పూజించడం ద్వారా మన సంస్కృతిని కాపాడటంతో పాటు ప్రకృతిని కూడా రక్షించుకోవచ్చని అన్నారు. “మట్టి వినాయకులను పూజిద్దాం.. నీటి కాలుష్యాన్ని నివారిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కందుల సంధ్యారాణి తెలిపారు. ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయకులను స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు *గుండబోయిన భూమయ్య* లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు *ఊరగొండ అపర్ణ* మరియు బిజెపి లేబర్ సెల్ పెద్దపెల్లి జిల్లా కన్వీనర్ *తడగొండ నరసయ్య, బిజెపి పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు *ఎల్తూరి సరిత* నాయకులు కొట్టే నరేష్, అందే రాజ్ కుమార్ చారి, సాతిరి గంగరాజు, కొమ్మల స్వామి, జక్కుల ప్రవీణ్–పద్మ, ఎల్తూరి రాజయ్య, పాకాల నరసింహారెడ్డి, హనుమాన్ల వెంకటేష్, అంకరి భరత్,మిస వికాస్ , లింగాల శంకర్, నిహారిక తదితరులు పాల్గొన్నారు...












