మంచేరియల్, 2026-07-23
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సాధారణ ల్లో భాగంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్,మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా రవాణా అధికారి గోపికృష్ణతో కలిసి ఆయన కార్యాలయ పనితీరు, రిలక్ష్యాలను పరిశీలించారు. చేరుకోవాలనిదారులకు సకాలంలో ఆర్సి,, కార్డులు అందించాలని
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సాధారణ తనిఖీల్లో భాగంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్,మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. మంచిర్యాల జిల్లా రవాణా అధికారి గోపికృష్ణతో కలిసి కార్యాలయ పనితీరును, రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డిటిసి రవీందర్ కుమార్ మాట్లాడుతూ, వాహనదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా డిస్పాచ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, మోటార్ వాహన తనిఖీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిరంతరం నిఘా ఉంచాలని, నిర్దేశిత రాబడి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఓవర్ లోడింగ్ కేసులు నమోదు చేయడమే కాకుండా, రాబడి లక్ష్యాలను సాధించడంలోనూ మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినందుకు జిల్లా రవాణా అధికారులను, సిబ్బందిని డిటిసి ప్రత్యేకంగా అభినందించారు. పరిమితికి మించి లోడుతో వెళ్లే వాహనాలపై ఇకపై కూడా ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.











