అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వారిచే నిర్వహించబడిన ఉల్లాస్ మేళా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి మండలం 100 అక్షరాస్యత కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన వాలంటరీ టీచర్లు, నూతన అక్షరాస్యులు, .. బండ శాంకరీ, మరియు అప్పటి మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ . పురుషోత్తం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు వారిని అభినందించారు. మండలం 100 అక్షరాస్యత కార్యక్రమంలో వీరి కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మంచిర్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు.











