విజయదశమి పండుగ సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గోదావరి ఒడ్డున గల శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శమీ పూజలో పాల్గొన్నారు. అంతకుముందు విశ్వనాథ ఆలయంలో అమ్మవారికి పూజ చేసి, రథాన్ని ప్రారంభించారు.
పట్టణం గోదావరి ఒడ్డున గల శ్రీ గౌతమేశ్వర ఆలయంలో విజయదశమి సందర్భంగా శమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ, శ్రీ కొక్కిరాల చరణ్ రావు పాల్గొన్నారు. అంతకుముందు విశ్వనాథ ఆలయంలో అమ్మవారి పూజ చేసి, రథాన్ని ప్రారంభించి, అక్కడి నుండి ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో గల జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నారు.
అనంతరం గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు జమ్మిపెట్టి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









