విజయదశమి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ హౌసింగ్ కాలనీలో శమీ పూజ నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
విజయదశమి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ హౌసింగ్ కాలనీలో శమీ పూజ నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులకు, మంచిర్యాల జిల్లా గౌరవ కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, హౌసింగ్ సొసైటీ నాయకులు, అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ శమీ పూజ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు కస్తూరి నాగేశ్వర్, మొండయ్య, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఎంపీఓ అసోసియేషన్ నాయకులు వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









