మహాజన నేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆశయ సాధన, ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ స్ఫూర్తితో ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ నెల 11వ తేదీన మంచిర్యాల పట్టణంలో నూతన కార్యవర్గ ప్రకటన, ఘన సన్మాన మహోత్సవం భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పట్టణ ఇంచార్జి గోడిసెల దశరథం మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇంచార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ హాజరయ్యారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించిన వేళ, ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గ ప్రకటన, సన్మాన మహోత్సవం
ఈ నెల 11వ తేదీన మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల పట్టణ కమిటీ నూతన కార్యవర్గ ప్రకటన, ఘన సన్మాన మహోత్సవం భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ వేదికపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్పీఎస్ సీనియర్ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం చేయడంతో పాటు, ఇటీవల నూతనంగా ఎన్నికైన అన్ని మండల కమిటీ బాధ్యులకు కూడా ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
అందరూ తరలిరావాలని పిలుపు
కావున, మంచిర్యాల జిల్లాలోని ప్రతి మండలం నుండి ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి ఎంఎస్ఎఫ్, మహిళా నాయకులు, యువజన నాయకులు, ఉద్యమకారులు అందరూ కదలి వచ్చి, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంతెన మల్లేష్ మాదిగ, గద్దల బానయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్ల మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మంచిర్యాల నియోజకవర్గం చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు మిట్టపల్లి మల్లయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ శ్రీరాంపూర్ పట్టణ అధ్యక్షుడు ఆవునురి భూమయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ నస్పూర్ మండల్ అధ్యక్షులు బచ్చలి రమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి గుంపుల స్వామి మాదిగ, కాశిపేట శంకర్ మాదిగ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ బేకం రాజారాం మాదిగ, మేరుగు శ్రీనివాస్ మాదిగ, చిప్పకుర్తి స్కైలాబ్ మాదిగ, చిప్పకుర్తి రమేష్ మాదిగ, జనగామ శ్యామ్ మదిగ తదితరులు పాల్గొన్నారు.










