మంచేరియల్, 30 September
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ డివిజన్‌కు చెందిన పలువురు బీజేపీ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి, సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ డివిజన్‌కు చెందిన పలువురు బీజేపీ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి, సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో దొడ్ల శ్రీకాంత్, కర్రే ప్రశాంత్, దొడ్ల సాయి రాజు, చాకినాల కృష్ణ, మారం శ్రీనివాస్, బొద్దున రాజేందర్ ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు మంతెన జగన్మోహన్ రావు నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ యువ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కొత్తగా చేరిన నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు.










