ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సీహెచ్పీ రామకృష్ణాపూర్లో డివైసిఎంఓ మధు కుమార్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, జీవనశైలి మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సీహెచ్పీ రామకృష్ణాపూర్లో డివైసిఎంఓ మధు కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మధు కుమార్ మాట్లాడుతూ, గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిత్యం వ్యాయామం చేయడంతో పాటు మద్యం, పొగాకు, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, సరైన నిద్రను పాటించాలని సూచించారు. బీపీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ సలహాలతో సరైన సమయంలో మందులు వాడటం వల్ల గుండెపోటును నివారించవచ్చని అన్నారు.
కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు
సీఎంఓ కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో, మందమరి జిఎం రాధాకృష్ణ సహకారంతో కార్మికుల శ్రేయస్సు కొరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది.
కార్మికులు అడిగిన ప్రశ్నలకు డివైసిఎంఓ మధు కుమార్,డాక్టర్ రాజ్ కుమార్ క్లుప్తంగా వివరణ ఇచ్చి సమాధానాలు అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంజనీర్ ఏ. చంద్రమౌళి, డాక్టర్ రాజ్ కుమార్ ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ హరిప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వైద్య ఆరోగ్య సిబ్బంది, సీహెచ్పీ కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












