మంచేరియల్, 2026-11-07
మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకువచ్చిన టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలోని -63పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలు, ఇప్పటివరకు సేకరించిన వివరాలను మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనంపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్నారు. గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో అదే దిశలో వెళ్తున్న టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనం టిప్పర్ను ఢీకొని రోడ్డుపై పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా వాహనం నడపడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వారిపై నుంచి టిప్పర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో సోహైల్ అఫ్రోజ్, మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వేల్పుల సిద్ధార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












