జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని ఆనంద్ నిలయం రెడ్ క్రాస్ సంస్థ వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా లీగల్ అథారిటీ సీనియర్ న్యాయమూర్తి శ్రీమతి కవిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, వృద్ధుల బాగోగులను తెలుసుకున్నారు.
జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్ నిలయం వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ అథారిటీ సీనియర్ న్యాయమూర్తి శ్రీమతి కవిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచిర్యాల లైన్స్ క్లబ్ సభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు శ్రీ మహేందర్ కూడా పాల్గొన్నారు. వైద్య శిబిరంలో 25 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ న్యాయమూర్తి కవిత నేతృత్వంలోని బృందం వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించింది. వృద్ధులను సొంతవారిలా ఆదరించాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సత్వర వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధులు, బీపీ, షుగర్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మందులు అందజేయడంతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులను మానవతా దృక్పథంతో చూసుకోవాలని, వారి అవసరాలు తీర్చాలని, వృద్ధులను గౌరవించాలని సూచించారు.
వైద్య శిబిరంలో డాక్టర్ అమన్, డాక్టర్ రమ్య, డాక్టర్ తబియా, జిల్లా వైద్య బృందం, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ రజిత, డాక్టర్ రాము, వారి బృందాలు వృద్ధులకు వైద్య సేవలు అందించాయి. గ్రామాల్లోనూ వృద్ధులకు అవసరమైన పరీక్షలు, కంటి పరీక్షలు, ఇతర వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ర ఊఫ్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు, లైన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా లీగల్ అథారిటీ బృందం వృద్ధులకు అవగాహన కల్పించింది.












