మంచేరియల్, July 8, 2026
జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ కేంద్రం ద్వారా అందిస్తున్న సాంకేతిక శిక్షణతో ముగ్గురు యువతులకు టిసిఎస్ (TCS) లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు లభించాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం నస్పూర్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఉద్యోగాలు సాధించిన జి. కావ్య, ఎమ్. అంజలి, కె. సాయివాణిలను అభినందించారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ కేంద్రం ద్వారా వివిధ సాంకేతిక కోర్సులలో అందిస్తున్న శిక్షణతో ముగ్గురు జిల్లా వాసులకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగాలు లభించాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా టాస్క్ కేంద్రం ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో టాస్క్ కేంద్రంలో శిక్షణ పొందిన జి. కావ్య, ఎమ్. అంజలి, కె. సాయివాణి అత్యున్నత ప్రతిభ కనబరిచి టిసిఎస్ (TCS) క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపికై ఉద్యోగాలు పొందడం అభినందనీయమని తెలిపారు.
టాస్క్ కేంద్రంగా అందిస్తున్న శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












