మక్తల్, 2026-07-29
మక్తల్ లో 1975-76 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
50 సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1975-76 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి హాజరై వారిని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాల జ్ఞాపకాలు జీవితాంతం మధుర స్మృతులుగా నిలిచిపోతాయని అన్నారు. ఐదు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
సమాజాభివృద్ధిలో పూర్వ విద్యార్థులు తమవంతు బాధ్యతను గుర్తించి విద్యా సంస్థల అభివృద్ధికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులను శాలువాలతో సత్కరించి, వారి అనుభవాలను ఆసక్తిగా విన్నారు.












