గత నవంబర్ నెలలో నిర్వహించిన NMMS స్కాలర్షిప్ పరీక్షలో జెండా వెంకటాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్షర మరియు వర్ష ఎంపిక అయ్యారు.
ఈ విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ అందించబడనుంది.
ప్రధానోపాధ్యాయురాలు జి. యశోదర మాట్లాడుతూ, లక్షెట్టిపేట మండలంలో ఎంపిక అయిన ఇద్దరు విద్యార్థులు తమ పాఠశాలకు చెందినవారే కావడం గర్వకారణమని తెలిపారు.
జెండా వెంకటాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం NMMS స్కాలర్షిప్కు ఎంపికవుతూ పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతిలో పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని ఆమె చెప్పారు.












