మండలంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న బాదావత్ విశాల్, తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, విద్యా సంస్థల ప్రతినిధులు విద్యార్థిని అభినందించారు.
మండలంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న బాదావత్ విశాల్, తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎదులాపురం శ్రీనివాస్, డీన్ హేమలత షిండే మాట్లాడుతూ, బాదావత్ విశాల్ తమ పాఠశాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి పోటీల్లో పాల్గొని రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్, రాఘవేంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఎర్ర సంపత్ విద్యార్థిని అభినందించారు. విద్యార్థి ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షించారు.












