జైపూర్, 2026-09-04
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, వేలాల గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మరియు 5 తేదీలలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని దేవాలయ అధికారులు కోరుతున్నారు.
శ్రీ మల్లన్న స్వామి దేవాలయం, వేలాల గ్రామం, జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా ------------------------------------------------------- ఇందుమూలంగా సమస్త భక్త జనులందరికీ తెలియపరచినది ఏమనగా తేదీ 4/9/2026 శుక్రవారం రోజున శ్రీ కృష్ణాష్టమి పర్వదినమున పురస్కరించుకొని శ్రీ మల్లన్న స్వామి దేవాలయం వేలాల గ్రామము నందు ఉదయము 10-00 గంటల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ వేడుకలు ప్రారంభించబడును ఈ సందర్భంగా దేవాలయం నందు ఉదయం 11-00 గంటల నుండి ఏక్కాహము (24 గంటలు భజన) 4/9/2026 రోజున ప్రారంభించబడును కావున భజన భక్తులు మరియు గ్రామ పెద్దలు అందరూ శ్రీ మల్లన్న స్వామి దేవాలయం వద్దకు రాగలరని మనవి. మరియు తదుపరి తేదీ 5/9/2026 శనివారం రోజున దేవాలయ ప్రాంగణం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఉట్టిగొట్టే కార్యక్రమం తదుపరి తీర్థ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమములు కలవు, కావున వేలలా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, మరియు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు , గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు భజన భక్తులు అందరూ శ్రీ మల్లన్న స్వామి దేవాలయము నందు నిర్వహించబడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు గైకొని ధన్యులు కాగలరని కోరుచున్నాము 🙏🙏🙏 ఇట్లు కార్యనిర్వహణ అధికారి దేవాదాయ- ధర్మాదాయ శాఖ శ్రీ మల్లన్న స్వామి దేవాలయం వేలాల గ్రామం












