మహబూబ్నగర్, 2023-08-18
మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల దేవాలయాల అర్చకులు, పురోహితుల సమ్మేళనం మంగళవారం సరస్వతి శిశు మందిర్లో జరిగింది. అర్చకో దేవో భవ: ఆధ్యాత్మిక భారతి పేరుతో గో సంరక్షణ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల్లో ఆధ్యాత్మిక స్పృహ పెంచి, సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబడింది.
మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల దేవాలయాల అర్చకులు, పురోహితుల సమ్మేళనం మంగళవారం సరస్వతి శిశు మందిర్లో జరిగింది. అర్చకో దేవో భవ: ఆధ్యాత్మిక భారతి పేరుతో గో సంరక్షణ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ భవిష్యత్తు ఆలయాలపైనే ఆధారపడి ఉందనే నినాదంతో ఈ సమ్మేళనం జరిగింది. గుడికి వచ్చే ప్రతి భక్తుడిలో ఆధ్యాత్మిక స్పృహ పెంచి, సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబడింది.
ఆలయాల స్వరూపం మారాలి
సమావేశంలో వక్తలు మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం దర్శనం చేసుకుని వెళ్లే ప్రదేశాలు కాదని, అవి సనాతన ధర్మాన్ని, నైతిక విలువలను నేర్పే ఆధ్యాత్మిక చైతన్య కేంద్రాలుగా మారాలని స్పష్టం చేశారు. ప్రతి పూజారి, గుడికి వచ్చే భక్తులకు మంత్రాల అర్థం, ఆచరణ విధానం, ధర్మ సూత్రాలపై అవగాహన కల్పించాలని కోరారు. మన ధర్మ రక్షణ, దేశ భవిష్యత్తుకు మార్గం చూపేది దీక్షతో ఉన్న అర్చక స్వాములే. అందుకే అందరం ఒక వేదికపైకి వచ్చి ఈ సంకల్పం తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
భక్తుల్లో మార్పు కోసం తీసుకోవాల్సిన చర్యలు
సమ్మేళనంలో పాల్గొన్న అర్చకులు ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఈ క్రింది కార్యాచరణను ప్రతిపాదించారు: ప్రతి వారం గుడిలో 15 నిమిషాలు భగవద్గీత, పురాణాల ఆధారంగా చిన్న ప్రవచనం ద్వారా భక్తులకు ధర్మం అర్థమయ్యేలా చేయడం. కేవలం దర్శనంతో ఆగకుండా, దీపం వెలిగించడం, నైవేద్యం, స్వచ్ఛతలో భక్తులను భాగస్వాములను చేయడం. పాఠశాల, కళాశాల విద్యార్థులకు సనాతన ధర్మం, గో సంరక్షణ, పర్యావరణ ప్రాముఖ్యతపై నెలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. పూజ చేసే విధానం, ఇంట్లో ఆచరించాల్సిన నిత్య కర్మల గురించి అర్చకులు స్వయంగా వివరించడం వంటివి ఇందులో ఉన్నాయి.
గోమాత రక్షణకు పిలుపు
గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని, గోవధ నిర్మూలనకు కఠిన చట్టాలు అమలు చేయాలని సమ్మేళనంలో తీర్మానించారు. ఈ లక్ష్యంతో డిసెంబర్ 17 వరకు 40 కోట్ల సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమ వివరాలు
ఈ తీర్మానాలకు ఆచరణ రూపం ఇచ్చేందుకు భారీ ఆధ్యాత్మిక భారతి సదస్సును నిర్వహించారు. సనాతన ధర్మ ప్రేమికులు, అర్చక స్వాములు, భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో గోఅభ్యాన్ ప్రతినిధులు జిల్లా ప్రభారీ వేముల హరిప్రసాద్, కర్ణకంటి రవీందర్, గోనె శ్యామ్ సుందర్ రావు, విశ్వనాథాలయ చైర్మన్ దొంతుల ముఖేష్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్, కామాక్య పిఠాధిపతులు సతీష్ భవాని, విశ్వనాథాలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ, వెంకటరమణ గురస్వామి, బూరుగుపల్లి రామకృష్ణ, కొక్కొండ వేణుగోపాల చారి, శ్రీనివాస్ ముస్త్యాల ప్రవీణ్ శర్మ, దత్తత్రేయ శర్మ, వేణు శర్మ, రమేష్ శర్మ, ప్రశాంత్ ఆచార్య, ప్రమోద్ ఆచార్యులు, వాసుదేవ రావు, 30 మంది అర్చక పురోహితులు పాల్గొన్నారు.












