మంచేరియల్, 11 September
మంచిర్యాల పట్టణంలో జరుగబోయే వినాయక ఉత్సవాలు మరియు నిమజ్జన ఏర్పాట్లపై హిందూ ఉత్సవ సమితి దృష్టి సారించింది. పట్టణ పరిధిలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, నిమజ్జనానికి తరలివచ్చే గణనాథులకు స్వాగత వేదికను ముఖరాం చౌరస్తా నుంచి హనుమాన్ చౌరస్తాకు మార్చాలని మున్సిపల్ అధికారులను కోరింది.
మంచిర్యాల పట్టణం పరిధిలో జరగబోయే వినాయక ఉత్సవాలు మరియు నిమర్జన ఏర్పాట్లకై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి కమిషనర్ కి వినతి *తేదీ: 11-09-2026, మంచిర్యాల* మంచిర్యాల పట్టణ పరిధిలో జరుగబోయే వినాయక ఉత్సవాలు మరియు నిమజ్జన ఏర్పాట్ల గురించి హిందూ ఉత్సవ సమితి - మంచిర్యాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు *శ్రీ డేగ రవిందర్* మాట్లాడుతూ... వినాయక చవితి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనానికి తరలివెళ్లే వినాయక రథాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పట్టణంలో రోడ్లు అన్నీ గుంతలమయంగా ఉన్నాయని, వాటిపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అనంత పద్మనాభ చతుర్థి రోజున నిమజ్జనం కోసం తరలివస్తున్న గణనాథులకు ముఖరాం చౌరస్తాలో మున్సిపల్ వారి సహకారంతో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వాగత వేదిక ఏర్పాటు చేసేవారని, కానీ ప్రస్తుతం మార్కెట్ లో రోడ్లు అన్నీ అధ్వాన్నంగా ఉన్నందున గణనాథుల రథాలు ముఖరాం చౌరస్తాకు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. కావున భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో ఎలాంటి ఆటంకం కలగకుండా స్వాగత వేదికను *హనుమాన్ చౌరస్తా (IB) మున్సిపాలిటీ కమాన్ వద్దకు మార్చి*, నిమజ్జనానికి వచ్చే గణనాథులకు స్వాగతం పలికే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు డేగ రవిందర్, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్, కోశాధికారి ముత్యాల కృష్ణ, ఉపాధ్యక్షులు ఇరుకుల్ల సూర్యనారాయణ, జూపక సుధీర్, తాళ్ల ఆదిరెడ్డి, కార్యదర్శులు కొండా కార్తీక్, ముక్తా విశ్వాస్, బోనగిరి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. *ఇట్లు* *హిందూ ఉత్సవ సమితి, మంచిర్యాల* *అధ్యక్షులు: శ్రీ డేగ రవిందర్* *ప్రధాన కార్యదర్శి: శ్రీ కర్ణకంటి రవీందర్*











