నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 3వ రోజు మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ మరియు జిల్లా చైర్మన్ శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గార్లచే ఈ అన్నదానం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గార్ల దంపతులు శ్రీ సిద్ధి వినాయక గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.
గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు జిల్లాలోని ప్రజలందరికీ ఉండాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావలసిన , 6లు, , , పెండింగ్ బిల్లులు అన్నీ కూడా శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులతో త్వరలోనే రావాలని కోరుకున్నారు. టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలిలో నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజూ మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యులు అందరూ కలిసి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాచకొండ గోపాలరావు, 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ సుదమల్ల హరికృష్ణ, జిల్లా సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల సమక్షంలో, శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గార్ల పుణ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గారిని కూడా సన్మానించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యదర్శులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి నాగేశ్వర్, హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, సైడ్ల మొండయ్య, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, తిరుపతి రెడ్డి, సునీత, ఎన్. సత్యనారాయణ, టి.తిరుపతి, ప్రసాద్, రాజేందర్, బెక్కం ఉషన్న, టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.











