మంచేరియల్, 02-08-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలో పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించింది. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1.10 లక్షలకు పైగా నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం/టాస్క్ ఫోర్స్‌కు కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలోని ఓ ఇంటిలో నగదును పందెంగా పెట్టి పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో 02-08-2026 అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో నగదు పందేలు నిర్వహిస్తూ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ.1,10,630 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కాసిపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినా లేదా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం/టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.











