రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా, నిల్వ, విక్రయం, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో సర్కిల్ వారీగా డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇప్పటికే, రెండు యాంటీ నార్కోటిక్ బృందాలు పనిచేస్తున్నాయి.
ఈ ప్రత్యేక బృందాలు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచార సేకరణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా నిర్వహించనున్నాయి. ప్రజల సహకారం కోసం కమిషనర్ విజ్ఞప్తి చేశారు.











