మంచేరియల్, 03-07-2026
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిలో పోలీసులంటే భయం కలిగేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిలో పోలీసులంటే భయం కలిగేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీసీఎస్ ఏసీపీలు కె. రవీందర్, టి. ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి. శ్రీనివాస్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు.












