మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో బేతేస్థ మినిస్ట్రీస్ చర్చ్ నిర్మాణ పనులకు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడారు.
మందమర్రి పాత బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించనున్న బేతేస్థ మినిస్ట్రీస్ చర్చ్ నిర్మాణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన బేతస్థ జెండాను ఎగురవేశారు. అనంతరం ఫాస్టర్ జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు మంత్రిని సన్మానించారు.
చర్చ్ నిర్మాణ కార్యక్రమం అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, క్రైస్తవ బోధనల్లోని క్రమశిక్షణ, సేవాభావం, పేదల పట్ల స్నేహపూర్వక వైఖరిని ప్రస్తావించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, మిషనరీ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.
మందమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై మంత్రి మాట్లాడుతూ, 1/70 ఏజెన్సీ యాక్ట్ ఉన్నప్పటికీ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడానని, త్వరలోనే ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, శ్మశాన వాటికలు, క్రిమిటోరియం, ఖబరస్తాన్ నిర్మాణాల గురించి కూడా ప్రస్తావించారు.
ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.











