టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు.
టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ సభ్యులు సునీత, కేజియారాణి, పద్మలత, అరుణ, పద్మజ, స్వప్న, జ్యోతి, డా. సాహిత్య, సరిత ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఆదిలాబాద్ శ్యామల దేవి ముఖ్య అతిథిగా విచ్చేసి, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మహిళా సభ్యులు, మహిళా నాయకులు, కాలనీ మహిళలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గౌరమ్మను ప్రార్థిస్తూ, మహిళా సోదరీమణులందరికీ ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథి శ్యామల దేవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు విచ్చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. టీఎన్జీవో యూనియన్ మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ, వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం టీఎన్జీవో ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ బంగారు బతుకమ్మ వేడుకలలో ప్రకృతి మిత్ర రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి అనుముల సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కూర్మచలం శ్రీనివాస్, నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, జాడి రామ్ కుమార్, పూదరి నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులు ప్రభు, సురేందర్, కార్తీక్, రోశయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోషన్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్, కార్యవర్గ సభ్యులు రాజేందర్, ప్రణవ్, మంచిర్యాల్ యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్, మందమర్రి యూనియన్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేశం, చెన్నూర్ యూనిట్ అధ్యక్షులు అభిషేక్, టీఎన్జీవో కాలనీ మహిళలు, పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










