టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి, మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి శ్యామల దేవి హాజరయ్యారు. మహిళా సభ్యులు, నాయకులు, కాలనీ మహిళలు ఆటపాటలతో వేడుకలను జరుపుకున్నారు.
జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి, మహిళా కమిటీ సభ్యులు శ్రీమతి సునీత, శ్రీమతి కేజియారాణి, శ్రీమతి పద్మలత, శ్రీమతి పద్మజ, శ్రీమతి అరుణ, శ్రీమతి స్వప్న, శ్రీమతి జ్యోతి, డా. సాహిత్య, శ్రీమతి సరిత ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఆదిలాబాద్ శ్రీమతి శ్యామల దేవి గారు విచ్చేయగా, టీఎన్జీవో మహిళా సభ్యులు, మహిళా నాయకులు, కాలనీ మహిళలు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆటపాటలతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గౌరమ్మను కోరుకుంటూ మహిళా సోదరీ సోదరీమణులందరికీ ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథి శ్రీమతి శ్యామల దేవి గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. టీఎన్జీవో యూనియన్ మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ, మహిళల కొరకు చాలా కార్యక్రమాలు చేస్తుందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం టీఎన్జీవో ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ బంగారు బతుకమ్మ వేడుకలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి అనుముల సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కూర్మచలం శ్రీనివాస్, నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, జాడి రామ్ కుమార్, పూదరి నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శి ప్రభు, సురేందర్, కార్తీక్, రోశయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోషన్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్, కార్యవర్గ సభ్యులు రాజేందర్, ప్రణవ్, మంచిర్యాల్ యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్, మందమర్రి యూనియన్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేశం, చెన్నూర్ యూనిట్ అధ్యక్షులు అభిషేక్, టీఎన్జీవో కాలనీ మహిళలు, పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










