
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో కాపు సంఘం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు తోట శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంచిర్యాలలో పేర్కొన్నారు.



















