
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన మృతిపై పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.



















