
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎంటీవో కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు, వాహనాల పార్కింగ్, బ్యారక్ల పరిశుభ్రతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎంటీవో కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు, వాహనాల పార్కింగ్, బ్యారక్ల పరిశుభ్రతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

మంచరయాకారపొరేషమదుకారయకరమంేగంతమైంద.ూుంూైరకుకారయకరమంకొసాగుతుంద.అయతే,గుుసమీపసతుందు,కేం1రుుమాతరమేమగఉాయ.ేపథయం,రాకీయపారటీాయకుు,బూతసథాయఅధకారుు(BLOు,BLAు)కసకటటుగాపచేయాపుపుచచారు.

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. శుక్రవారం ఆయన నస్పూర్, మంచిర్యాల మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి, ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. మందమర్రి మండలంలోని పలు రైస్ మిల్లులను కూడా తనిఖీ చేసి, కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సరఫరాలో జాప్యం వహించవద్దని సూచించారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్టిపి ఏరియాలో డీజీఎం(యాష్) గా పనిచేసి, బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గా బదిలీ అవుతున్న శ్రీ ఎనగందుల స్వామిరాజుకు ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను జిఎం శ్రీ ఎం. నరసింహారావు కొనియాడారు.

టిఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ SM హుస్సేనీ ముజీబ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మంచిర్యాల మున్సిల్ కార్ొరేషన్ రిధిలోని 7వ డివిజన్లో ఓటరు సవరణ ్రక్రియ (SIR)ై BLOలు, BLAలకు అవగాహన కల్ించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ్రేమ్ సాగర్ రావు గారు ాల్గొని, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.

జర్నలిస్టులకు బస్సు పాసుల్లో పూర్తి రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టి.డబ్ల్యూ.జె.ఎఫ్.) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల డిపో సహాయ నిర్వాహకురాలు శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు నాయకులు తెలిపారు.

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి.డబ్ల్యూ.జె.ఎఫ్) నాయకులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ చంద్రయ్యను కోరారు. ఈ మేరకు వారికి వినతిపత్రం సమర్పించారు.

జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి, వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపివేయడం, టిఫిన్ బండ్ల ఏర్పాటు వంటివి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తాయని, ప్రమాదాలకు దారితీస్తాయని ఎస్ఐ తెలిపారు.

బెల్లంపల్లి పట్టణంలోని ఆర్య వైశ్య భవన్లో బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ఇంచార్జ్ కన్నెబోయిన ఓదెలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక అంశాలపై చర్చించారు.

శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అన్నం వెంకన్న, అనారోగ్యంతో కాలుకు సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ వేముల రవి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, అధైర్యం చెప్పారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు.

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. శుక్రవారం న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ కోసం BRS.మాజీ అధ్యక్షులు గాదె సత్యం, కార్పోరేటర్ సత్తార్, కోసం కౌన్సిలర్లు తోట తిరుపతి, పోరెడ్డి రాజు మరియు ఇతర నాయకులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు కోసం శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు

మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 40 రోజుల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స పొందిన 600 గ్రాముల బరువున్న ఒక నవజాత శిశువు ఆరోగ్యంగా ఇంటికి చేరింది. డాక్టర్ శ్రీనివాస్ గోపతి నేతృత్వంలోని వైద్య బృందం ఆధునిక నియోనేటల్ చికిత్సా విధానాలను ఉపయోగించి ఈ అద్భుతం సాధించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఈ చిన్నారికి ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా ఉచితంగా చికిత్స అందించింది.

రామగుండం CAR హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అంగల గోపి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం నిద్రలేవగానే అస్వస్థతకు గురై మరణించిన అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకుల్లో మంచిర్యాల జిల్లా 360 స్కోర్ తో రాష్ట్రంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి గురువారం విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా విద్యాశాఖ, మహిళ-శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం మంచిర్యాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగే ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని కోరారు.