శ్రీరాంపూర్, 2026-06-05
సింగరేణి సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లను అకారణంగా తొలగిస్తున్నారని, ఇది ఆయా కుటుంబాలను రోడ్డున పడేయడమేనని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) తీవ్రంగా ఆరోపించింది. సంస్థ ఇచ్చిన సర్క్యులర్లను పక్కన పెట్టి, గుడ్ విల్ ఓనర్లకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని సంఘం కార్యదర్శి దూలం శ్రీనివాస్ విమర్శించారు.
సింగరేణి సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లను అకారణంగా తొలగిస్తున్నారని, ఇది ఆయా కుటుంబాలను రోడ్డున పడేయడమేనని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) ఆరోపించింది. సంస్థ ఇచ్చిన సర్క్యులర్లను పక్కన పెట్టి, గుడ్ విల్ ఓనర్లకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని సంఘం కార్యదర్శి దూలం శ్రీనివాస్ విమర్శించారు. ఈ విషయంలో యాజమాన్యం ఆదేశాలకు విలువ లేదని, గుడ్ విల్ ఓనర్ల ఆగడాలకు తలొగ్గి కాంట్రాక్టు డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
నిబంధనల ఉల్లంఘన
శ్రీరాంపూర్ ఓసిపిలో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాహనంపై నిబద్ధతతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్ను, కొత్త టెండర్ వచ్చిందనే నెపంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్థక్ష్యంగా తొలగించడం జరిగిందని దూలం శ్రీనివాస్ తెలిపారు. భూనిర్వాసితులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కన్వేయన్స్ వాహన టెండర్లను కేటాయిస్తే, ఆ పేరుతో భూనిర్వాసితులను మభ్యపెడుతూ, గుడ్ విల్ పేరుతో ఒక సిండికేట్ దందా నడుపుతున్న వ్యక్తులు తమకు నచ్చిన విధంగా నిబంధనలు పాటించకుండా, కాగితాలకు మాత్రమే పరిమితమయ్యేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అధికారుల పాత్రపై విమర్శలు
అధికారులు కూడా వారి పెత్తనం ముందు తలొగ్గి, వారికి ఎలాంటి అవరోధాలు లేకుండా దగ్గరుండి తతంగాలను నడుపుతున్నారని, అవేమీ మాకు పట్టదు, గుడ్ విల్ ఓనర్లకే మా మద్దతు అనే విధంగా బహిరంగంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టెండర్ ఆర్డర్ పొందిన భూనిర్వాసితుడు రాకుండానే ఈ మొత్తం తతంగం గుడ్ విల్ ఓనర్ల చేతుల మీదుగానే జరిగిపోతుండడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు. భూనిర్వాసితుల టెండర్ నియమం ప్రకారం, వాహనాన్ని ఇతరులకు అమ్మడానికి గానీ, కొనడానికి గానీ అవకాశం లేదని, అయినప్పటికీ తామే యజమానులం అంటూ బహిరంగంగా చెబుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా గుడ్ విల్ ఓనర్ల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
విచారణకు డిమాండ్
సంస్థ కోసం కనీస బాధ్యతగా విధులు నిర్వహించలేని స్థితిలో కొందరు అధికారుల పనితీరు ఉందని, శ్రీరాంపూర్ ఓసిపిలో కన్వేయన్స్ వాహనంలో జరుగుతున్న ఈ తతంగంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అలాగే, అకారణంగా తొలగించిన కన్వేయన్స్ డ్రైవర్ను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
పోరాట హెచ్చరిక












