మంచేరియల్, 2026-07-14
ప్రభుత్వ నిబంధనలు, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టానికి లోబడి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో అటవీ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన గిరిజన రైతులకు మాత్రమే చట్టం వర్తిస్తుందని, నూతనంగా సాగుచేస్తున్న వారు పరిధిలోకి రారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టానికి లోబడి పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో నిబంధనలను అతిక్రమించి సాగు చేస్తున్న అటవీ భూములను జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, కోటపల్లి సి.ఐ. కృష్ణ, అటవీ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ లతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టానికి లోబడి పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం 2005కు ముందు సాగులో ఉండి పట్టా పొందిన అర్హులైన గిరిజన రైతులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని చెప్పారు. చట్ట ప్రకారం 2005 నాటికి 75 ఏళ్లుగా సాగులో ఉండి పట్టా పొందిన గిరిజనేతరులకు మాత్రమే అవకాశం ఉంటుందని, 2005 తర్వాత నూతనంగా అటవీ భూములను సాగు చేస్తున్న వారు చట్ట పరిధిలోకి రారని స్పష్టం చేశారు.
అనర్లు, నూతనంగా అటవీ భూములను సాగు చేయకుండా స్థానికులకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి భూములకు సంబంధించి చెన్నూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో మ్యాప్ అందుబాటులో ఉందని, సందేహాలు ఉన్నవారు మ్యాప్ ను పరిశీలించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












