Nalgonda/Gurrampode (ప్రజావార్త) జూలై 27
జైపూర్ మండలంలో జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనుల కోసం ప్రదేశాలను గుర్తించడం, అంచనాలు తయారు చేయడం, గ్రామ సభలు నిర్వహించడం వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ - జలసిరి / VB-GRAM-G కార్యక్రమం కింద చేపట్టనున్న వివిధ నీటి సంరక్షణ పనులకు తగిన ప్రదేశాలను గుర్తించి, అంచనాలు తయారు చేసి, గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు.
తేదీ 27.07.2026 న MPP జైపూర్ నందు MPDO, MPO & APO ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో 'జలసిరి కార్యక్రమం' కింద కింది పనులకు వెంటనే ప్రదేశాలను గుర్తించి అంచనాలు తయారు చేయాలని తెలియజేయడమైనది:
1. వ్యవసాయ కుంటలు (Farm Ponds) 2. సామూహిక ఇంకుడు గుంతలు (Community Soak Pits) 3. వ్యక్తిగత ఇంకుడు గుంతలు (Individual Soak Pits) 4. బోరు రీఛార్జ్ నిర్మాణాలు (Borewell Recharge Structures) 5. పర్కోలేషన్ ట్యాంకులు (Percolation Tanks) 6. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు (Rain Water Harvesting Structures) 7. మ్యాజిక్ డ్రెయిన్లు (Magic Drains) 8. బహిరంగ బావులు (Open Wells)
ఇంకా, పై పనులపై ప్రజాభిప్రాయం స్వీకరించడానికి మరియు ప్రదేశాలను ఖరారు చేయడానికి రాబోవు 2 రోజులలోపు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు (PS) ఆదేశాలు జారీ అయ్యాయి. కావున, అందరు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఆదేశాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసి, చేసిన పని నివేదికను కార్యాలయానికి సమర్పించాలని కోరడమైనది.












