మంచేరియల్, జూలై 1, 2026
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డిసిపి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్.టి.సి., విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో గత 6 నెలలుగా అరైవ్ - అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో 253 రోడ్డు ప్రమాదాలు జరగగా 75 మంది మృతి చెందారని తెలిపారు.
మున్సిపల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల, ఇతర రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై తక్కువ విజిబిలిటీ ఉన్న చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై అదుపు తప్పిన, ఓవర్ లోడెడ్ వాహనాలు, పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా 66 ఓవర్ లోడ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాలలో అంతర్గత రహదారులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారి లైసెన్సులను నిబంధనల ప్రకారం రద్దు చేయాలని, వారి వివరాలు, పరిమితికి మించి లోడింగ్ చేసి తనిఖీలలో పట్టుబడిన వాహనాల వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఓవర్ లోడింగ్, మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.












