మంచేరియల్, 29-07-2026
మంచిర్యాల పట్టణంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా 51వ డివిజన్లోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ఈ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించిన 51వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి నీలి స్వప్న సోము శ్రీనివాస్, మున్సిపల్ కార్మికులతో కలిసి జేసీబీ సహాయంతో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను చేపట్టారు.
మంచిర్యాల పట్టణంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 51వ డివిజన్లోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే 51వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి నీలి స్వప్న సోము శ్రీనివాస్ గారు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. జేసీబీ తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ "వర్షాన్ని కూడా లెక్కచేయకుండా డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే మాకు తెలియపరచగలరు. సమస్య పరిష్కారానికి తక్షణమే మార్గం చూపిస్తాను" అని హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ చేస్తున్న కృషిని చూసి డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్న కార్పొరేటర్‌కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.












