పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం, ఎక్లాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులలో భాగంగా, ఉప్పులేటి శ్రీలత-శంకర్ దంపతుల ఇంటి స్లాబ్ పనులను గ్రామ సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్ ప్రారంభించారు.
పేదల సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ఈ కార్యక్రమం ఎక్లాస్పూర్ గ్రామంలో మరో ముందడుగు వేసింది. లబ్ధిదారులైన శ్రీలత-శంకర్ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కృషి ఫలితంగా, ప్రతి పేదవానికి పక్కా ఇల్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.
నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని సర్పంచ్, ఉప సర్పంచ్ లు అధికారులకు, మేస్త్రీలకు సూచించారు. సొంత ఇంటి కల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.









