మంచేరియల్, 18 October
ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం మంచిర్యాలలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగింది.
ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు తూటి శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు.
ఈ వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కలవేన శంకర్ ముదిరాజ్, రావుల రాజశేఖర్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు శాతం మల్లేష్ ముదిరాజ్, పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు అనవేన సూరయ్య ముదిరాజ్, గొల్లపల్లి మత్స్య పరిశ్రమ సంఘం అధ్యక్షుడు సంగనవేణి సత్తయ్య ముదిరాజ్ తో పాటు కుల సంఘాల పెద్దలు, నాయకులు, పట్టణ వార్డు అధ్యక్ష, కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











