తెలంగాణ ప్రభుత్వం, ఆధునిక షియర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి, ఆసిఫాబాద్ జిల్లా కొఱారి గ్రామంలో 12 రోజుల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసింది.
మే 23న పునాది పనులు ప్రారంభించగా, జూన్ 4న కాంక్రీట్ స్లాబ్‌తో సహా మొత్తం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం తలుపులు, కిటికీలు అమర్చే పనులు జరుగుతున్నాయి.
ఈ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం వల్ల లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇంజనీర్లు ఈ గోడలు భూకంపాలను తట్టుకునేంత దృఢంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విధానం కూలీల ఖర్చును కూడా ఆదా చేస్తుందని చెప్పారు.








