మంచిర్యాల జిల్లాలో బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా డీసీపీ, పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.











