మంచేరియల్, 10-07-2026
మంచిర్యాల నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు (11-07-2026) శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలవనుంది. రాంనగర్ సబ్ స్టేషన్ లో నిర్వహించనున్న మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు.
మంచిర్యాల 33/11KV రాంనగర్ సబ్స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా మంచిర్యాల పరిధిలోని పలు ప్రాంతాలలో రేపు (11-07-2026) శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఐబీ ఏరియా, వైశ్య భవన్ ఏరియా, LIC కాలనీ, రాంనగర్, శ్రీనివాస టాకీస్ రోడ్డు, ఓల్డ్ మంచిర్యాల, శ్రీలక్ష్మి నగర్, పద్మశాలి కాలనీ, పవర్ సిటీ, సన్ సిటీ, కాలేజీ రోడ్డు, గర్మిల్లా, NTR కాలనీ, ఎడ్లవాడ, రెడ్డి కాలనీ, సంజీవయ్య కాలనీ, గోసేవమండల్ మరియు రంగాంపేట ప్రాంతాలలో ఈ అంతరాయం ప్రభావం చూపుతుంది.
ఈ విషయాని గమనించి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ AE, ఎం. రాజేష్ మనవి చేశారు.











