మంచేరియల్, July 11, 2026
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా మంచిర్యాల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా మంత్రిని కలిసి మొక్కను బహుకరించారు.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సింగరేణి అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, ఆబ్కారీ మద్యనిషేధ శాఖ పర్యవేక్షకులు చాణక్య, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ లు కలిసి మంత్రికి మొక్కను అందజేశారు.










