చెన్నూర్, 2027-07-27
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ లో పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పుష్కరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్లు కేటాయించగా, చెన్నూర్ లో 70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ లో పుష్కర ఘాట్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నీటిపారుదల శాఖ అధికారి విష్ణు, మండల తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ లతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు 2027 కొరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల కొరకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చెన్నూర్ లో పుష్కరాలు, మౌలిక వసతుల అభివృద్ధి కొరకు 70 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్లు, స్నానపు గదులు, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, పుష్కరాలకు దాదాపు 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా రోడ్లు, త్రాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, పార్కింగ్ తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోదావరి రోడ్డుతో పాటు చెన్నూర్ పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, అంబేద్కర్ విగ్రహం నుంచి చెన్నూర్ వరకు సుమారు 5 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ, లైటింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, పేదలు, చిరు వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా 1 కోట్ల 20 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అమృత్ 2.0 పథకం క్రింద సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూర్ పెద్ద చెరువును సుమారు 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, శివ్వారం గోదావరి మొసళ్ల మడుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలం, కోటిలింగాల, చెన్నూర్ లోని అంబ అగస్తేశ్వర ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పుష్కరాల నాటికి ఆలయాలు, పుష్కర ఘాట్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెన్నూర్ లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఈ నెలలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనంతరం పుష్కర ఘాట్‌లోని హనుమాన్ ఆలయంలో భూమిపూజ నిర్వహించారు. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బొక్కలగూడెంలో గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమిపూజ చేశారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ భవనం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పేద గౌడ కులస్తులలో ఇందిరమ్మ ఇళ్లు లేని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇళ్ల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సన్న బియ్యం పంపిణీ తదితర అంశాలపై మంత్రి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

