మంచేరియల్, 2026-07-15
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలంలోని మద్దికల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని మండల తహసిల్దార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలంలోని మద్దికల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని మండల తహసిల్దార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మద్దికల్ గ్రామంలో మొత్తం 853 సర్వే నంబర్లలో 4,810 ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉందని తెలిపారు. ముగ్గురు లైసెన్స్డ్ సర్వేయర్లు, ఒక సర్వేయర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రీ-సర్వే పనులకు రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం ఉండదని, స్పష్టమైన వివరాలతో నక్షా రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
మండలంలోని ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులను వేగవంతం చేసి, ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మండలంలోని అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్‌ను తహసీల్దార్‌తో కలిసి పరిశీలించి, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వానికి అందించాల్సిన సి.ఎం.ఆర్. బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











