*సిద్దిపేట* (ప్రజావార్త) జూలై 12
సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు 3వ స్థానంలో నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కఠోర సాధనతో విద్యార్థినులు ఈ విజయం సాధించారు.
సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థినులు మూడవ స్థానంలో నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు ఈ ఘనత సాధించారు.
ఆర్. జశ్విత, ఆర్. రిషిక, జె. మనస్విక, బి. సోనిక తో పాటు మరికొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా జట్టుగా పాల్గొని మంచిర్యాల జిల్లాకు 3వ స్థానం సాధించిపెట్టారు.
ఈ విజేతలను తక్కువ సమయంలోనే కఠోర సాధన చేయించి తీర్చిదిద్దిన రెవల్యూషన్ స్కూల్ PT టీచర్లు అశ్విని మేడం మరియు వెంకటేష్ సార్ ల కృషి అభినందనీయం. విద్యార్థినులకు, PT టీచర్లకు రెవల్యూషన్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.









