మంచేరియల్, 2026-09-02
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా నోటీసుల జారీ అనంతరం ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ జాబితాలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు.
హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026లో నోటీసుల జారీ అనంతరం సంబంధిత ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, ప్రత్యేక ఉపపాలనాధికారి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, డి.ఎ.ఓ. రమేష్ లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026లో హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ క్రమంలో మార్కింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల విచారణ వేగవంతం చేయాలని, అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని తెలిపారు. జాబితాలో గల ఓటర్లు తమ వివరాలను సమర్పించేలా రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా చర్యలు తీసుకోవాలని, ఎస్.ఐ.ఆర్.–2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు











