భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీసిసి కార్నర్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ లు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను, పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పథకాలను గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో తీసుకువచ్చిన సంస్కరణలను, పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన తీసుకువచ్చిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నస్పుర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేష్, అన్ని డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా, యువజన, మైనార్టీ, రిటైర్మెంట్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.








