మంచేరియల్, 2026-07-11
మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, దీనిని వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు జిల్లా అధికారులను కోరారు. ఓటర్ల అవగాహన లోపం, BLOల పనితీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను జిల్లా అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కోరారు.
జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని అన్నారు.
ఎన్యూమరేషన్ పత్రాలను BLOలు 08-07-2026 నాటికి 99 శాతం పంపిణీ చేసినట్లు నివేదిక ఇచ్చారని, అయితే దీనిని అధికారులు మరోసారి సవరణ చేసుకోవాలని సూచించారు.
BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత, వాటిని నింపి తిరిగి BLOలకు ఇచ్చే బాధ్యత ఓటర్లది. 2002 ఓటర్ లిస్టులో ఉన్నవారికి లేదా వారి కుటుంబ సభ్యుల ఓటును కనుగొనే ప్రక్రియపై ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి BLOలు ప్రత్యేక చొరవ చూపి, ఎన్యూమరేషన్ పత్రాలను నింపి తిరిగి తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా, ఎన్యూమరేషన్ పత్రాలను ఇంటింటికీ ఎలా ఇచ్చారో, అదే విధంగా తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత BLOలదేనని నొక్కి చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకునేలా జిల్లా కలెక్టర్ BLOలకు సూచించాలని కోరారు.
08-07-2026 నాటికి మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లిలో 26.15 శాతం, లక్షెట్టిపేటలో 24.82 శాతం, హాజీపూర్ లో 22.91 శాతం, మంచిర్యాలలో 3.54 శాతం, నస్పూర్ లో 2.89 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి తీసుకున్నారని, మొత్తం నియోజకవర్గంలో 100 శాతానికి కేవలం 11.89 శాతం మాత్రమే పూర్తయిందని తెలిపారు.
ఇదే వేగంతో కొనసాగితే, గడువులోపు ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి కాదని హెచ్చరించారు. కావున, మంచిర్యాల జిల్లా కలెక్టర్ సర్ ప్రక్రియకు అదనంగా BLOలను కేటాయించాలని కోరారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని ఓటర్లందరూ ప్రత్యేక సమగ్ర సవరణకు సహకరించి, ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, సర్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని, అవసరమైతే మరికొంతమంది BLOలను కేటాయించాలని సూచించారు. గడువు పూర్తయ్యే నాటికి ప్రతి ఒక్క ఓటరు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి, ఓటు నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ దేనని అన్నారు.










