హైదరాబాద్, 2026-08-17
సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలులో ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఈ పథకాలపై కోర్టు స్టే విధించిందని, అయితే ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలులో ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఈ పథకాలపై కోర్టు స్టే విధించిందని, అయితే ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
కళ్యాణలక్ష్మి పథకంపై దాఖలైన నంబర్ 21732/2026 కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై డివిజనల్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పథకంపై ఇప్పటివరకు జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలైందని, ఈ పథకంలోని లోపాలు గత ప్రభుత్వం 2014లో సరైన ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్లే తలెత్తాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, పథకాన్ని కొనసాగించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం పథకం లోపభూయిష్టమైన జీవోలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనిపై అధికారుల లోపమా లేక న్యాయపరమైన అంశాలు చూసే వారి లోపమా అని విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలని అన్నారు. పేదింటి ఆడబిడ్డ వివాహ సమయంలో కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.
2014లో ప్రారంభమైన ఈ పథకాలు అనంతరం , వర్గాలకు కూడా విస్తరించాయని, ఇప్పటివరకు పథకాల ద్వారా భారీ ప్రయోజనం చేకూరిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వెల్ఫేర్ కింద 2,734.81 కోట్లతో 2,73,164 మంది, వెల్ఫేర్ కింద 1,801.48 కోట్లతో 1,79,939 మంది, వెల్ఫేర్ కింద 7,803.05 కోట్లతో 7,79,401 మంది, వెల్ఫేర్ కింద 831.70 కోట్లతో 83,074 మంది, మైనార్టీ వెల్ఫేర్ కింద 3,204.83 కోట్లతో 3,62,769 మంది లబ్ధి పొందారని తెలిపారు. మొత్తం 16,375.87 కోట్లు ఖర్చు చేసి 16,78,347 మందికి ప్రయోజనం అందించినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
పథకాలు చట్టాన్ని అమలు చేయడానికి కాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని, దీనికి సుప్రీంకోర్టు తీర్పు కూడా న్యాయ ఆధారమని ప్రభుత్వం పేర్కొంది. పథకాల కోసం కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని, ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతాయని తెలిపారు. నివేదికలోని అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అవి పథకం చట్టవిరుద్ధమని తుది న్యాయ నిర్ణయం కాదని అన్నారు. వివాహాన్ని కేవలం ప్రైవేట్ ఈవెంట్‌గా చూడటం సరికాదని, పేద కుటుంబాలకు వివాహం ఒక సామాజిక, ఆర్థిక బాధ్యత అని, ఈ పథకాలు సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమం అనే రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని వివరించారు.











