మంచేరియల్, 2026-06-30
హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రాజ్య సభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు, రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ అభయ్ పాటిల్ గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.












