మంచేరియల్, 2026-07-01
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడం, నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ డీసీపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, నిధుల దుర్వినియోగంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో అవినీతి, సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడం, శాంతియుత నిరసన చేపట్టిన నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ డీసీపీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కీలకంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. మహా ప్రస్థానం నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు మంజూరు చేసినా, ఎమ్మెల్యే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద మంచి నీటి సరఫరా, చెరువుల అభివృద్ధికి మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు 320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, అక్కల రమేష్, వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గోపతి రాజయ్య, ఆకుల అశోక్ వర్ధన్, పచ్చ స్వప్న రాణి, ఆడే ప్రేమ్ సింగ్, బేర సత్యనారాయణ, డేగ బాపు, మోతె సుజాత, బైరం లక్ష్మి, స్వరూప రాణి, బొద్దున మల్లేష్, నల్ల రవి, బందెల రవి గౌడ్, బొప్పు కిషన్, బల్జపల్లి తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు.












