మంచిర్యాల (ప్రజావార్త) సెప్టెంబర్ 12
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకుడు గడ్డం సిద్దు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని శనివారం చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ పరామర్శించి, ఓదార్చారు.
సిద్దు కుటుంబాన్ని పరామర్శించిన చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ జిల్లా/ రామకృష్ణాపూర్ : బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకుడు గడ్డం సిద్దు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని శనివారం బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిద్దు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు. మృతుని కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, అలుగుల సత్తయ్య, యూత్ నాయకులు లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, పొన్నం హరీష్, నస్పూరి శివ తదితరులు పాల్గొన్నారు.










