మంచేరియల్, 2026-07-25
బేగంపేట్ లోని హరిత ప్లాజాలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం, పటిష్టతపై నాయకులు దిశా నిర్దేశం చేశారు.
బేగంపేట్ లోని హరిత ప్లాజాలో ఈరోజు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జి, రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ బన్సల్, చంద్రశేఖర్ జి, రామచంద్ర రావు పార్టీ నిర్మాణం, పటిష్టత మరియు వివిధ అంశాలపై రానున్న రోజుల్లో దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్, మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కూడా పాల్గొన్నారు.










